మహబూబాబాద్ :మరిపెడ మండల కేంద్రం తో పాటు ఇతర గ్రామాలలో శనివారం ఉదయం భారీ వర్ష పాతం నమోదయింది. మరిపెడ పురపాలక కేంద్రంలోని రామా విలాస్ వీధిలో నీరు రహదారిపై నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న మరిపెడ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి సూచన మేరకు స్థానిక వార్డ్ కౌన్సిలర్ రామ విలాస్ గల్లీని సందర్శించి రోడ్డుపై నిలిచిన నీటిని తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. రామ విలాస్ గల్లీతోపాటు ఇతర వీధులు సైతం జలమయమయ్యాయి. ఈ సమయంలో కాసేపు వాహనదారుడు రహదారులపై ప్రయాణించేందుకు ఇబ్బందులు పడ్డారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మరిపెడ మండలంలో గరిష్టంగా 80.8 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదయింది. మరిపెడతో పాటు ఇతర మండలాల్లో సైతం ఓ మోస్తరు వర్షాలు కురిసాయి.

