Wednesday, July 15, 2026

Buy now

ఆక్వా పార్కులో నిర్వాసిత స్థానిక మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

* లేల్లెల బాలకృష్ణ మత్స్యకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్

మంచిర్యాల(ప్రజానావ ప్రతినిధి) :హాజీపూర్ మండలం నంన్నూర్ గ్రామంలో నిర్వాసిత మత్స్యకార గ్రామాల ప్రజలతో బోయిరి రాజకుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి లేల్లెల బాలకృష్ణ తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాజరై మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మచ్చ సంపద యోజన పథకం ద్వారా 2026 -27 సంవత్సరం ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసర ప్రాంతంలో సుమారు 100 కోట్ల రూపాయలతో 85 ఎకరాల స్థలంలో నిర్మాణం అవుతున్న ఆక్వా పార్క్ మత్స్య పరిశ్రమ చేపలు రొయ్యలు కొర్రమీను శుభ్రపరచడం ప్రాససింగ్ చేయడం విదేశాలకు విజ్ఞత చేసే పనులు మత్స్యకార యువత, మహిళలకు శిక్షణ సంస్థలు, భవన నిర్మాణం, ఫిష్ కోర్టులు, పర్యటక రంగం అభివృద్ధి పేరుతో స్థానిక స్వయం సహాయ బృందాలకు అవకాశాలు కల్పించడం చేస్తామన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో గుడి పేట, నంన్నూర్, రాపల్లి, కర్ణ మామిడి గ్రామాల స్థానిక మత్స్యకారులకు ప్రధాన జీవనాధారం చేపల వృత్తి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సంయుక్తంగా నిర్మిస్తున్న ఆక్వా పార్కులో ఈ నాలుగు గ్రామాల మత్స్యకారులను భాగస్వామ్యం చేయాలని, యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఆక్వా పార్కు నిర్మాణంలో ఇలాంటి అవకతవకులు జరగకుండా పారదర్శకంగా నిర్మించాలని, నాలుగు గ్రామాల నుంచి మత్స్యకారుల 25 మంది కమిటీని భాగస్వామ్యం చేయాలని, మత్స్యకారుల గ్రామాల్లో చాపల మార్కెట్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోయిరి శ్రీకాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు, మంచర్ల రాజేందర్ జిల్లా అధ్యక్షులు, బోడంకి చందు జిల్లా కార్యదర్శి, జునవరి నారాయణ జిల్లా ఉపాధ్యక్షులు, గగ్గురి రాజన్న జిల్లా సహాయ కార్యదర్శి, బోయిరి రాజకుమార్ జిల్లా నాయకులు, మత్స్యకారులు జునగారి మల్లేష్, మొగుళ్ళ మహేష్, బొగ్గుల చంద్రశేఖర్, రాకేష్, జునగాని గణేష్, ఉట్నూరి రాజ నర్సు, తదితర మత్స్యకారులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular