సిరిసిల్ల: వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామంలోని బంగిరెడ్డి తండాకు చెందిన బుక్య సక్కుబాయి పారా తైక్వాండో జాతీయ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అభినందించి సన్మానించారు.
మహారాష్ట్ర రాష్ట్రం పుణే నగరంలోని శివ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, మహాలుంగేలో జూలై 10, 11 తేదీలలో నిర్వహించిన 5వ ఇండియా తైక్వాండో ఓపెన్ పారా జాతీయ ఛాంపియన్‌షిప్–2026–27లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన సక్కుబాయి, **పారా పూంసే P72 స్పోర్ట్స్ క్లాస్** విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, సక్కుబాయి సాధించిన విజయం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ కనబర్చి తెలంగాణతో పాటు భారతదేశానికి మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాస్ పాల్గొన్నారు.

