Monday, August 24, 2026

Buy now

శనాయిపల్లి గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవాలు

ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : వనపర్తి జిల్లా, రేవల్లి మండలంలోని ​శనాయిపల్లి గ్రామంలో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు ఎంతో వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో జరిగాయి. గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో మహిళలందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి, తలపైన మంగళహారతులు, వర్ణరంజితంగా అలంకరించిన బోనాలెత్తుకొని ఊరేగింపుగా తరలివచ్చారు.

​ఈ సందర్భంగా పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల మోతలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులందరూ భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గ్రామస్తులు అమ్మవారిని వేడుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామ ప్రజాప్రతినిధులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular