Sunday, August 23, 2026

Buy now

పాలిటెక్నిక్ విద్య వ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో 97ను రద్దు చేయాలి

* యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలి
* ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఆర్నకొండ సాయి ఆజాద్, కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం

పెద్దపల్లి : పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా సమితి ఆధ్వర్యంలో పెద్దపల్లి రైల్వే స్టేషన్ రోడ్ ట్రినిటీ పాఠశాల నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించటం జరిగింది.

అనంతరం ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయి ఆజాద్, రేణుకుంట్ల ప్రీతం లు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్య అనేది పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే ఒక ఎం ప్రత్యేక వ్యవస్థ అని పేర్కొన్నారు.

దీనిని శక్తి శాఖలో కలపటం వలన విద్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ పరం అయితే పేద మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో కూడిన డిప్లోమా విద్య అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.పేద విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య ప్రభుత్వాలు అందుబాటులో ఉంచాలి గాని పేద విద్యార్థులను మరింత విద్యకు దూరం చేసే కుట్రలకు ప్రభుత్వం పూనుకుంటుందనీ పాలిటెక్నిక్ కళాశాలను సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 97 ను ఉపసంహరించుకోవాలని రాష్ట్రంలో సాంకేతిక విద్యా మండలిని విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించడంతో అందుకు మంత్రివర్గం ఉప సంఘం పచ్చ జెండా ఊపింది కానీ ఆ తర్వాత కొత్తగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని ఐటీ పరిశ్రమలు శాఖ పరిధిలో నడుస్తున్న ఈ యూనివర్సిటీని సాంకేతిక విద్యా శాఖ పరిధిలోకి తెస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆ దిశగా ముందడుగు వేయలేదని తాజాగా ఐటిఐలు, ఏటీసీలు పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో చేర్చాలని సర్కార్ ఆలోచన విధానం సరికాదని దీంతో ప్రభుత్వం సాంకేతిక విద్యాశాఖతో ఆటలాడుతూ ఉంటే అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం చూస్తూ ఊరుకోనేదే లేదన వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇలాంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీ ద్వారా విద్యార్థులు కార్మికులుగా మారే అవకాశం ఉందని, వేలాదిమంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాసి పాలిటెక్నిక్ కళాశాలలో జాయిన్ అవుతరాని నేడు ప్రభుత్వం తీసుకువచ్చిన నిర్ణయాన్ని చూసి విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని, లక్షలాదిమంది విద్యార్థులు ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో చదువుతున్నారని ప్రభుత్వం వారికి అధిక సదుపాయాలు కల్పించి అధ్యాపకుల భర్తీ, ల్యాబ్ల ఆధునికరణ, వర్క్ షాపులు నిర్వహణ హాస్టల్ అభివృద్ధి చేయాలి కానీ ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయడం సరికాదని తక్షణమే ఈ ఆలోచనను ఉపసంహరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా నాయకులు తడిగొప్పుల అను సాయి, ఆర్నకొండ ఆదిత్య, వెంకటేశ్వర్లు, జశ్వంత్, రోహిత్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular