Friday, September 4, 2026

Buy now

35 క్వింటాళ్ల PDS బియ్యం అక్రమ రవాణా భగ్నం

* భూపాలపల్లి CCS పోలీసుల చర్యలు

భూపాలపల్లి: అక్రమంగా తరలిస్తున్న 35 క్వింటాళ్ల PDS బియ్యాన్ని భూపాలపల్లి CCS పోలీసులు పట్టుకున్నారు. భూపాల్లి కలెక్టరేట్ సమీపంలోని జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టుబడింది.

ఇద్దరు నిందితుల అరెస్ట్
ఈ కేసులో “పావనపు రాజు (26)”, “నీలుగొండ రమేష్ (21)” లను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన TS 02 UC 2103 నంబర్ గల టాటా పికప్ ట్రాలీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

అక్రమ రవాణాపై కఠిన చర్యలు
PDS బియ్యం అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, IPS హెచ్చరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Related Articles

spot_img

Most Popular