◆ పేదలకు నాణ్యమైన విద్యే లక్ష్యం: ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి
◆ దమగ్నాపూర్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల పరిశీలన
ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యనందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ వద్ద 22 ఎకరాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, కాంక్రీట్ పనులను ప్రారంభించారు.
1 నుంచి 12వ తరగతి వరకు 2,720 మంది విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పిస్తున్నామని, పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే కౌకుంట్ల వద్ద మోడల్ స్కూల్ కోసం 5 ఎకరాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఆధునిక ల్యాబ్‌లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, హాస్టల్ సదుపాయాలతో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని చెప్పారు.

