Friday, September 4, 2026

Buy now

వర్షాభావం ఉన్న ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం

* ఆర్ జి వన్ ఏరియాలో ఉత్పత్తి లో ముందంజ
* సిహెచ్ పి ద్వారా పరిశ్రమలకు వేగంగా బొగ్గు రవాణా
* ఆగస్టు నెల బొగ్గు ఉత్పత్తి వివరాలు వెల్లడించిన
* జీఎం లలిత్‌కుమార్

రామగుండం:రామగుండం ఏరియా-1లో ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించి ముందంజలో నిలిచినట్లు జీఎం లలిత్‌కుమార్‌ వెల్లడించారు. మంగళవారం ఆర్ జీ వన్ ఏరియా జిఎం కార్యాలయం లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిఎం లలిత్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ ఆగస్టు మాసంలో బొగ్గు ఉత్పత్తి,కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం తీసుకుంటున్న వివరాలను వెల్లడించారు.

ఆర్జీ-1 పరిధిలోని భూగర్భ బొగ్గు గనులు, ఉపరితల గనుల ప్రాజెక్టుల్లో ఆగస్టు నెలలో 124 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు పేర్కొన్నారు.ఆగస్టు నెలలో 2,45,200 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 3,04,086 టన్నుల ఉత్పత్తి సాధించామని అన్నారు.నిర్ణీత లక్ష్యం కంటే అధికంగా ఉత్పత్తి సాధించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రామగుండం ఏరియా నుంచి 2,45,200 టన్నుల బొగ్గు రవాణా లక్ష్యానికి గాను 2,50,739 టన్నుల బొగ్గును రవాణా చేసి 102 శాతం సాధించినట్లు తెలిపారు.

జీడీకే-1,3 బొగ్గు గనుల్లో 64 శాతం,జీడీకే-2,2ఏ బొగ్గుగనిలో 71 శాతం,జీడీకే-1ఏ గనిలో 29.8 శాతం ఉత్పత్తి సాధించినట్లు లలిత్‌కుమార్‌ స్పష్టం చేశారు.ఈ ఏడాది నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్మికుల భద్రత రక్షణకు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నామని జీఎం పేర్కొన్నారు. గనుల్లో భద్రతా రక్షణ ప్రమాణాలను పాటిస్తూ ఉత్పత్తి సాధిస్తున్నట్లు తెలిపారు.ఎన్ టి పి సి ఇతర పరిశ్రమలకు అవసరమైన బొగ్గును వేగంగా రవాణా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకునైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు.జీడికే 11 వ గని లో మూడవ మ్యాన్ రైటింగ్ కు ప్రణాళికలు సిద్ధం చేశామని గనిలో కంటిన్యూస్ మైనర్ యంత్రాలను 20 కోట్లతో ఖర్చు చేసి బొగ్గు ఉత్పత్తి అధికంగా సాధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

రాపిడి గ్రావిటీ ద్వారా మంచినీటిని అందించేందుకు పనులను పూర్తిస్థాయిలో వేగవంతం చేశామని,ఎస్టిపి నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయని త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.తద్వారా గోదావరి లోకి మురికినీటిని శుద్ధి చేసి మంచినీటిని నదిలోకి పంపడం ద్వారా కార్మికుల కాలనీలకు మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తామని అన్నారు. అదేవిధంగా కార్మికుల కాలనీలలో డ్రైనేజీ వ్యవస్థతో ఇబ్బందులు కలుగకుండా త్వరలోనే పనులు చేపడతామని పేర్కొన్నారు.

మెడికల్ ఇన్వాల్యుడేషన్ జరగడంలేదని డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ కు దరఖాస్తు చేసుకున్న 25 మందికి సెటిల్మెంట్లు చేసినట్లు తెలిపారు.ఈ విలేకరుల సమావేశంలో ఎస్ ఓ టు జి ఎం చంద్రశేఖర్‌,పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి,ఫైనాన్స్ అధికారి లక్ష్మీబాయి,ఐఈడి ఆంజనేయులు,ఏరియా వర్క్ ఎస్ ఈ జితేందర్‌సింగ్‌, సీనియర్ పర్సనల్ ఆఫీసర్లు వేణు,హనుమంతరావు, ఎస్ఎస్ఓ వీరారెడ్డి,శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular