Friday, September 4, 2026

Buy now

సర్ ప్రక్రియలో క్లెయిమ్‌లు, అభ్యంతరాలను 16లోగా సమర్పించాలి

* పెద్దపల్లి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు
*​ నో మ్యాపింగ్, అనామలీస్‌గా గుర్తించిన ఓటర్లకు నోటీసులు జారీ
*​ జిల్లాలో ఇప్పటివరకు 1,49,194 నోటీసులు జనరేట్ చేయగా, అందులో 58,313 నోటీసులు ఓటర్లకు అందజేత
*​ నోటీసు జారీ చేసిన 7 రోజుల అనంతరం ఈఆర్‌ఓల ఆధ్వర్యంలో విచారణ
*​ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్ కార్యక్రమంపై అవగాహన

పెద్దపల్లి : ​సర్ కార్యక్రమంలో భాగంగా ప్రచురించిన డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సెప్టెంబర్ 16 వరకు సమర్పించవచ్చని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు తెలిపారు.​మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్ కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు.

సర్ ప్రక్రియలో చేపడుతున్న చర్యలు, డ్రాఫ్ట్ ఓటరు జాబితా, క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, నోటీసులు, విచారణ తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు మాట్లాడుతూ డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై వచ్చే క్లెయిమ్‌లు, అభ్యంతరాలన్నింటినీ నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. అర్హత కలిగిన ఏ ఓటరు పేరు కూడా జాబితాలో లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

​నో మ్యాపింగ్, అనామలీస్‌గా గుర్తించిన ఓటర్లకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 1,49,194 నోటీసులు జనరేట్ చేయగా, అందులో 58,313 నోటీసులను సంబంధిత ఓటర్లకు అందజేసినట్లు వెల్లడించారు. నోటీసు జారీ చేసిన తేదీ నుంచి ఏడు రోజుల అనంతరం సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఆధ్వర్యంలో విచారణ నిర్వహిస్తామని చెప్పారు.

నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్దేశిత గడువులోగా విచారణకు హాజరై తమ ఓటు హక్కుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని సూచించారు. ​ఓటు హక్కును క్లెయిమ్ చేసుకునే సమయంలో భారత ఎన్నికల సంఘం ఆమోదించిన 11 రకాల పత్రాల్లో ఒకదాన్ని ఆధారంగా సమర్పించాల్సి ఉంటుందని అదనపు కలెక్టర్ తెలిపారు.

ఓటరు పుట్టిన తేదీకి సంబంధించిన నిబంధనల ప్రకారం అవసరమైన సందర్భాల్లో తల్లిదండ్రులకు సంబంధించిన రికార్డులు, ఆధార పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ​డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పేరు ఉన్న ప్రతి ఓటరు తన పేరు, వయస్సు, చిరునామా, ఇతర వివరాలను పరిశీలించుకోవాలని, వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నా, పేరు జాబితాలో లేకపోయినా, అర్హత లేని పేరు ఉన్నట్లు గుర్తించినా నిర్దేశిత విధానంలో క్లెయిమ్, అభ్యంతరాన్ని సమర్పించాలని తెలిపారు.​సర్ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఓటర్లకు అవసరమైన సమాచారాన్ని అందించాలని, నోటీసులు అందుకున్న ఓటర్లకు విచారణకు హాజరయ్యే విధానం, సమర్పించాల్సిన పత్రాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ ప్రక్రియలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ​రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా తమ పరిధిలోని ఓటర్లకు సర్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ కోరారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాను పరిశీలించి, అర్హత కలిగిన ఓటర్ల పేర్లు నమోదు అయ్యేలా, అవసరమైన సవరణలు జరిగేలా తమ సూచనలు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం సమర్పించాలని,​క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ అనంతరం వాటిని సంబంధిత అధికారులు పరిశీలించి, అవసరమైన చోట విచారణ నిర్వహించి నిబంధనల ప్రకారం పరిష్కరిస్తారని అదనపు కలెక్టర్ తెలిపారు.

​ఓటర్లు సర్ ప్రక్రియను సద్వినియోగం చేసుకొని తమ ఓటు హక్కుకు సంబంధించిన వివరాలను సరిచూసుకోవాలని, అవసరమైన క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సెప్టెంబర్ 16లోగా సమర్పించాలని,​ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు, రాజకీయ పార్టీలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.​ఈ సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు విజయ్, ఐటి టెక్నికల్ కిరణ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular