Friday, September 4, 2026

Buy now

దేవరకద్రలో కాలువల సామర్థ్యం పెంపు: ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి

ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : సాగునీటి వనరుల సద్వినియోగమే లక్ష్యంగా కాలువల సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం మంగనూర్‌ వద్ద కేఎల్‌ఐ మెయిన్‌ కెనాల్‌ నుంచి డిస్ట్రిబ్యూటరీ D8, D12, D13 కాలువలను అధికారులు, రైతులతో కలిసి ఆయ‌న పరిశీలించారు.

అడ్డాకుల, మూసాపేట్, భూత్పూర్‌ మండలాల్లోని గొలుసుకట్టు చెరువులను నింపేందుకు కొత్త కాలువల ఏర్పాటుపై చర్చించారు. డిస్ట్రిబ్యూటరీ కాలువల సామర్థ్యం పెంచి మొత్తం 7,500 ఎకరాలకు నీరందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువులు నిండితే భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

Related Articles

spot_img

Most Popular