◆ రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారు.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ప్రజానావ ఉమ్మడి మహబూబ్‌నగర్ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను, ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం మహబూబ్‌నగర్‌లోని రాజీవ్ చౌరస్తాలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన నిరసన సభలో ఆయన మాట్లాడారు.
100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్, వెయ్యి రోజులైనా వాటిని పట్టించుకోలేదని విమర్శించారు. సాగునీరు, విద్యుత్ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, యూరియా కోసం రోడ్లపై క్యూ కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రూ. 500లకే గ్యాస్, 2 లక్షల ఉద్యోగాల పేరుతో రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. నిరసనలో భాగంగా 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు వాకిటి శ్రీధర్, రమేష్ గౌడ్, బి.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

