◆ నందిన్నె సబ్ స్టేషన్ వద్ద రైతుల ధర్నా
◆ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సంఘీభావం, అధికారుల హామీతో విరమణ
ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : గద్వాల నియోజకవర్గం, కే.టీ దొడ్డి మండలంలోని నందిన్నె విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట వ్యవసాయానికి 18 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.
ఈ విషయం వాట్సాప్ ద్వారా తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వెంటనే ధర్నా స్థలికి చేరుకుని రైతులకు మద్దతుగా నిరసనలో కూర్చున్నారు. రైతుల నిరసన తీవ్రతను గుర్తించిన విద్యుత్ శాఖ ఎస్ఈ, డిఈ ఉన్నతాధికారులు సబ్ స్టేషన్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన కరెంట్ కొరత తీర్చేలా కృషి చేస్తామని ఎమ్మెల్యేతో పాటు అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.

