Friday, September 4, 2026

Buy now

పెద్దమందడి–వనపర్తి రోడ్డు పనులు పూర్తిచేయాలి

◆ రహదారిపై బీఆర్‌ఎస్ పాదయాత్ర.. సంఘీభావం తెలిపిన నిరంజన్ రెడ్డి
◆ రూ.40 కోట్లు మంజూరైనా నిలిచిన పనులు.. కలెక్టరేట్‌కు వినతిపత్రం

ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : పెద్దమందడి–వనపర్తి రహదారిని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ మండల యూనిట్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఏళ్లుగా గుంతలమయంగా మారిన ఈ రోడ్డు వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో ఈ రోడ్డు కోసం రూ.40 కోట్లు మంజూరైనా పనులు మధ్యలోనే నిలిచిపోయాయని, కలెక్టర్ చొరవ తీసుకుని పనులను వేగవంతం చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఏఓకి వినతిపత్రం సమర్పించారు. ​ఈ పాదయాత్రకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంఘీభావం తెరిపి, కొంతదూరం నడిచారు. మండల ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Related Articles

spot_img

Most Popular