* బహుజన ప్రజాస్వామిక వేదిక రాష్ట్ర అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ
* జనగనలలో కుల గణన సాధించి తీరుతాం
* కేంద్ర ప్రభుత్వ వైఖరి పై బీసీ సంఘాల మండిపాట
పెద్దపల్లి : సామాజిక న్యాయ సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జనగణలో ఓబీసీ కుల గణన చేపట్టి ప్రతి కులానికి క్యాస్ట్ కోడ్ ఇవ్వవలసిందేనని బహుజన ప్రజాస్వామిక వేదిక రాష్ట్ర అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పెద్దపెల్లి ఆర్కే గార్డెన్ లో వివిధ కుల సంఘాల రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశానికి తాడూరి శ్రీమన్నారాయణ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఇప్పుడు ఓబీసీ కుల గణన చేపట్టకపోతే ఓ బి సి కులాల ఉనికికే ప్రమాదం ఏర్పడనున్నదని ఆయన హెచ్చరించారు 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఓబీసీ కులాల లెక్కలు లేకపోవడం వలన వారి జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని శ్రీమన్నారాయణ అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి భారతీయుడు ఓ బి సి లెక్కలు ఎందుకు సేకరించడం లేదో కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నించాలని ఆయన కోరారు డ్రాప్ డౌన్ మెథడ్ ద్వారా ప్రతి కులానికి యూనిక్ కోడ్ ఇచ్చిన తర్వాతనే కుల గణన చేపట్టాలని సమావేశం డిమాండ్ చేసింది జన గణనలలో కుల గణన సాధించేవరకు ఓబీసీ లు ఉద్యమించవలసిందేనని ఆయన అన్నారు ఓ బీసీల గొంతు కోసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రశ్నావళి ఉందని ఆయన అన్నారు యాదవ గౌడ శెట్టిబలిజ కుమ్మరి కుమ్మరి వడ్రంగి రజక పద్మశాలి ఇతరత్రా ఓబీసీ కులాలకు యూనిక్ కోడు లేకుండా కుల గణన జరిగితే ఓ బీసీ కులాల జాబితాలో లేనట్లుగా నిర్ధారణ అవుతుందని ఆయన అన్నారు.
భావితరాల ఓబిసి వారికి సామాజిక న్యాయం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం కులగనన చేపట్టే వరకు ఉద్యమ కార్యచరణను విడవద్దని బీసీ సంఘాల ప్రతినిధులను కోరారు. ఈ సమావేశంలో కామెడీ రాజేశం డాక్టర్ నంద భాస్కర్ యాదవ్ ఉస్తం శ్రీనివాస్ ముదిరాజ్ పర్వతాలు యాదవ్ ఆడెపు సుధాకర్ కావేటి రాజగోపాల్ శంకర్ గౌడ్ భూత గడ్డ సంపత్ ముదిరాజ్ కామిని రాజేశం ముదిరాజ్ చందర్ యాదవ్ ఆడెపు సుధాకర్ కురుమ మధుకర్ శ్రీనివాస్ ఎల్లాపి మార్కెట్ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ గుర్రంపల్లి రాజు మూలసాల శ్రీనివాస్ కొమురవెల్లి సదానందం నోముల శ్రీధర్ రావు మల్లికార్జున్ ముదిరాజ్ న్యాయవాది కరుణాకర్ 50 కుల సంఘాల ప్రతినిధులు న్యాయవాదులు విద్యార్థులు బీసీ మేధావులు పాల్గొన్నారు.

