Saturday, September 14, 2024

Buy now

kumari aunty: బిగ్‌బాస్‌కు కుమారీ ఆంటీ?

అవును.. మీరు చదువుతున్నది నిజమే.. ఈ సీజన్‌ తెలుగు బిగ్‌బాస్‌కు కుమారి ఆంటీ (దాసరి సాయికుమారి)ని తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

మరికొన్ని నెలల్లో సరికొత్త సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే బిగ్‌బాస్‌ టీమ్‌ కంటెస్టెంట్ల కోసం వెతుకులాట ప్రారంభించినట్లు సమాచారం.

ఈక్రమంలోనే కుమారీ ఆంటీకి బిగ్‌బాస్‌ ఆహ్వానం పంపినట్లు సమాచారం. అయితే దీనిపై కుమారీ ఆంటీ ఎలాంటి నిర్ణయం చెప్పలేదన్నట్లు వినికిడి.

గతంలోనూ పలు సీజన్లలో చాలామంది బిగ్‌బాస్‌కు వెళ్తున్నట్లు ప్రచారం జరిగినా.. వారు హౌస్‌లో కనిపించేంత వరకు విషయాన్ని భయటపెట్టలేదు.

గతంలోనూ చాలాసార్లు కుమారీ ఆంటీని బిగ్‌బాస్‌ తీసుకుంటుందంటూ నెటిజన్లు ట్రోల్‌ చేశారు. అయితే కుమారి ఆంటీ ఈ సీజన్‌కు బిగ్‌బాస్‌ వెళ్తే వారు చెప్పిందే నిజం కానుంది.

కుమారీ ఆంటీ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరు తెలియని వారుండరు. పదేళ్లకు పైగా ఆమె రోడ్‌ సైడ్‌ మిల్స్‌ బిజినెస్‌ చేస్తోంది. ఆమె ఫుడ్‌ స్టాల్‌ వద్ద జనం క్యూ కట్టడంతో ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.

అయితే ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వయంగా ఆమెను ఇబ్బందులకు గురిచేయొద్దంటూ ఆదేశాలు జారీ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో కుమారీ ఆంటీ పేరు మార్మోగిన విషయం తెలిసిందే. కుమారీ ఆంటీ క్రేజ్‌ను పలు టీవీ ఛానాళ్లు కూడా క్యాష్‌ చేసుకున్నాయి.

Related Articles

spot_img

Most Popular