◆ మూడు ప్రధాన HAM ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు
◆ టూరిజం హబ్‌గా మారనున్న ప్రాంతం
ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని బల్మూర్‌లో రూ. 146.71 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూడు ప్రధాన హెచ్‌ఎమ్‌ఏ రహదారుల విస్తరణ పనులకు మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు, ఎంపీ శ్రీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణలతో కలిసి శంకుస్థాపన నిర్వహించారు.
అమ్రాబాద్-తొల్పలపల్లి, బల్మూర్-నాగర్‌కర్నూల్, అచ్చంపేట-రాకొండ రహదారుల అభివృద్ధి ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీ పెరిగి, భవిష్యత్తులో ఈ ప్రాంతం ప్రముఖ టూరిజం హబ్‌గా మారుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి దక్కాల్సిన నిధుల సాధన కోసమే సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని తెలిపారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి మంజూరు చేయించుకున్న శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, సోమశిల వంతెన ప్రాజెక్టులతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రయాణ భారం తగ్గడంతో పాటు సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందన్నారు. సమిష్టి కృషితో అచ్చంపేటను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

