Monday, September 7, 2026

Buy now

అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులు: వనపర్తి జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా పంపిణీ కార్యక్రమం

ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టింది. వనపర్తి జిల్లా కలెక్టరేట్ వేదికగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా రేవల్లి, ఏదుల మండలాల్లో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

​ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరై కార్డులను అందజేశారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వాడల పర్వతాలు, రేవల్లి మండల అధ్యక్షుడు యండి సుల్తాన్ అలీ, ఏదుల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పందెం సుఖేందర్ రెడ్డి, సర్పంచులు టప్ప రాజయ్య, లోడే అంజలమ్మ, పాంపురం రేణుక, పరశురామ్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే BC సెల్ అధ్యక్షుడు ఎద్దుల కురుమయ్య, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కూర చందు, ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు జానకిరామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular