Sunday, September 6, 2026

Buy now

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పీఏసీ సమావేశం

ఉట్నూర్:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశం ఉట్నూర్‌లోని నందిరెడ్డి గార్డెన్‌లో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సమావేశంలో నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో SIR ఫేజ్-2 కార్యాచరణ ప్రణాళిక, పట్టణ, డివిజన్, మండల కమిటీల నియామకాలు, బీఎల్‌ఏ-2 కార్యకలాపాల పర్యవేక్షణ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల భవనాల నిర్మాణం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

అలాగే ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, పార్టీతో పాటు ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

సమావేశంలో పాల్గొన్న నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్.. నిర్మల్ జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలు, SIR సర్వే, కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలపై ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు వివరించారు.

ఈ సమావేశంలో నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు శ్రీహరి రావు, విఠల్ రెడ్డి, మాజీ మంత్రి వేణుగోపాల్ చారి, పెద్దపల్లి ఎంపీ వంశీ, పీఏసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular