Sunday, July 19, 2026

Buy now

ఎల్‌నినో ముప్పు: పంటల మార్పిడిపై అవగాహన కల్పించాలి

​◆ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షాధార సాగుపై ఆధారపడే రైతులకు నష్టాలు కలగకుండా పంటల మార్పిడిపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది జిల్లాలో ఎల్‌నినో ప్రభావం కనిపించే అవకాశం ఉన్నందున, వర్షాధార రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అధికారులు గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి పంటల మార్పిడిపై చైతన్యపరచాలని సూచించారు.

Related Articles

spot_img

Most Popular