* సెప్టెంబరు 6, 7, 8 తేదీల్లో కరీంనగర్‌లో రాష్ట్ర మహాసభలు
* సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాల నరసింహ
ప్రజానావ ఉమ్మడి మహబూబ్‌నగర్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్‌లను రద్దు చేసి, పాత 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించే వరకు పోరాటాలు సాగిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాల నరసింహ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బిజ్జా శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026 సెప్టెంబరు 6, 7, 8 తేదీలలో కరీంనగర్ పట్టణంలో జరగనున్న ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
1886 చికాగో పోరాటాల నుంచి నేటి వరకు కార్మికులు సాధించుకున్న హక్కులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్ మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మహాసభలకు నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి కార్మికులు, శ్రేయోభిలాషులు భారీగా తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.నరసింహ, బి.లక్ష్మీపతి, టి.శివుడు, శ్రీనివాసులు, శేఖర్, మధు, సైదులు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

