Friday, September 4, 2026

Buy now

నాణ్యతా లోపంతో కుంగిన బ్రిడ్జి సీసీ రోడ్డు

ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : ​రేవల్లి – నాగర్‌కర్నూల్ ప్రధాన రహదారిపై పంట పొలాల వెళ్లే సాగునీరు కాలువపై ఇటీవల నిర్మించిన బ్రిడ్జి సీసీ రోడ్డు ప్రారంభానికి ముందే పెద్ద రంధ్రంతో కుంగిపోయింది. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మాజీ జడ్పీటీసీ భీమయ్య, మాజీ సర్పంచ్ శివరాం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

​ఈ మార్గం గుండా నిత్యం పొలం ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, నాగర్‌కర్నూల్ వెళ్లే వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, భారీ వాహనాలు ఏదైనా రంధ్రంలో చిక్కుకుంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని, రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Related Articles

spot_img

Most Popular