Saturday, September 5, 2026

Buy now

నిరుపేదల సొంతింటి కల సాకారం

◆ గృహప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
◆ లబ్ధిదారులకు కానుకల అందజేత

ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : ప్రజా పాలనలో నిరుపేదల సొంతింటి కల సాకారమవుతోందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులు ఏర్పాటు చేసిన నూతన గృహప్రవేశ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

​ఈ సందర్భంగా నూతన గృహాల్లో అడుగుపెడుతున్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా కానుకలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఏళ్లనాటి తమ సొంతింటి కలను నెరవేర్చిన ఎమ్మెల్యేను లబ్ధిదారులు శాలువాలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చింతలకుంట గ్రామానికి చెందిన రమేష్‌రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.

Related Articles

spot_img

Most Popular