* కెనాల్ పరిధిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడి.. తహశీల్దార్
ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : పాలమూరు-రంగారెడ్డి కెనాల్ పరిధిలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందంటూ ఈ నెల 26న ‘ప్రజానావ’ దినపత్రికలో ప్రచురితమైన ‘పాలమూరు-రంగారెడ్డి కెనాల్ పరిధిలో ప్రభుత్వ భూమి ఆక్రమణ?’ కథనంపై స్థానిక తహశీల్దార్ సరస్వతీ స్పందించారు.
నాగపూర్, రేవల్లి వైపు వెళ్లే కెనాల్ పరిధిలో నష్టపరిహారం అందుకున్న భూములను కొందరు మళ్లీ సాగు చేసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మాజీ సర్పంచ్ శివరాంరెడ్డి తెలిపిన వివరాల ఆధారంగా సంబంధిత భూమిని రెవెన్యూ సిబ్బందితో సర్వే చేయిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, కెనాల్ పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడతామని తహశీల్దార్ స్పష్టం చేశారు.

