Sunday, September 6, 2026

Buy now

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం

మంచిర్యాల: 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హరిత ఫంక్షన్ హాల్‌లో మంచిర్యాల జిల్లా ప్రొఫెషనల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్‌సాగర్‌రావు పాల్గొని రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి రక్తదానం ఎంతో విలువైన సహాయాన్ని అందిస్తుందని తెలిపారు.

కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, మంచిర్యాల జిల్లా ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular