ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : నాగర్ కర్నూల్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సంఘం టౌన్ అధ్యక్షుడు కేతా సంతోష్ ఆధ్వర్యంలో నాయకులు పాఠశాలను సందర్శించి, ప్రధానోపాధ్యాయులు రామ్‌జీకి వినతిపత్రం అందజేశారు.
విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు బాలురకు సరిపడా వాష్‌రూమ్‌లు, సురక్షితమైన తాగునీరు, ఫ్యాన్లు, బెంచీలు వంటి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హెచ్ఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ సభ్యులు గణేష్, ఆకాష్, జగన్, ఉదయ్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

