Sunday, September 6, 2026

Buy now

బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలి

◆ వనపర్తి జిల్లా ఎస్పీ సునిత రెడ్డి

ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, బాధితులకు చట్టప్రకారం త్వరితగతిన న్యాయం అందించాలని వనపర్తి జిల్లా ఎస్పీ సునిత రెడ్డి, ఐపీఎస్. అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 12 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో భూ వివాదాలు 9, పరస్పర గొడవలు 2, కుటుంబ సమస్యలకు సంబంధించినవి 1 ఉన్నాయి.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే అవకాశం లభిస్తుందన్నారు. కేసుల దర్యాప్తులో ఎలాంటి జాప్యం జరగకూడదని, అధికారులు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంచాలని సూచించారు.

Related Articles

spot_img

Most Popular