Sunday, September 6, 2026

Buy now

బాలానగర్ పీఎస్‌ను తనిఖీ చేసిన ఎస్పీ జానకి

◆ ​ట్రాఫిక్‌కు ఆటంకం కలగొద్దు
◆ ​కేసుల విచారణ వేగవంతం చేయాలి

ప్రజానావ ఉమ్మడి మహబూబ్‌నగర్ బ్యూరో : జిల్లా ఎస్పీ డి.జానకి మంగళవారం బాలానగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీఎస్‌లోని కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, స్టేషన్ రికార్డులు, బీట్ వ్యవస్థను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్‌హెచ్-44పై బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల దృష్ట్యా వాహనదారులకు, అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని అధికారులను ఆదేశించారు.

పీక్ అవర్స్‌లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరిస్తూ, మహిళలు, పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

Related Articles

spot_img

Most Popular