* పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి: ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్
మెదక్: మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని పలు విభాగాలను పరిశీలించి, కేసుల దర్యాప్తు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, చట్టపరమైన ప్రక్రియలను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేయాలని ఎస్పీ ఆదేశించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంతో పాటు పేకాట, ఇతర అసాంఘిక, అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు, ఫిర్యాదులపై సత్వర స్పందన ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసుల పనితీరు ద్వారా ప్రజల్లో పోలీస్ శాఖపై ఉన్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు.
స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు అధికారులను ఆదేశించారు.

