Saturday, September 5, 2026

Buy now

యువజన కాంగ్రెస్‌ను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలి

* రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిట్టపల్లి వెంకటేష్

పెద్దపల్లి : యువజన కాంగ్రెస్‌ను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు అసెంబ్లీ, జిల్లా, మండల స్థాయి కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జి మిట్టపల్లి వెంకటేష్‌ సూచించారు. బుధవారం ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు క్యాంపు కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లాలో చేపట్టనున్న కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో కార్యకర్తలు ముందుండాలని వెంకటేష్‌ పిలుపునిచ్చారు.

ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని సూచించారు. జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొంకూరి అవినాష్‌, పెద్దపల్లి అసెంబ్లీ అధ్యక్షుడు ముత్యాల నరేష్‌ ముదిరాజ్‌, మంథని అసెంబ్లీ అధ్యక్షుడు చీమల సందీప్‌, రాష్ట్ర కార్యదర్శి మధుకర్‌ యాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు రౌతు మనోజ్‌కుమార్‌, గుమ్మడి ప్రసాద్‌, పిరంగి రాజు, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు ఎంచర్ల తిరుమలేశ్‌ యాదవ్‌, ప్రధాన కార్యదర్శి ఆయుభ్‌ఖాన్‌, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రవణ్‌, మండల అధ్యక్షులు జడల రాజు, సిరిసెటి రాహుల్‌, ఒర్రె అజయ్‌ యాదవ్‌, దేవేందర్‌రెడ్డి, నాయకులు అరగొండ రాజ్‌కుమార్‌, వెలిశాల రాకేష్‌, రాకేష్‌ యాదవ్‌, గుర్రాల వాసు, అజయ్‌, పల్లెపు పూర్ణ, చొప్పరి కుమార్‌, గూడెపు సూర్యకిరణ్‌, అర్నకొండ సాగర్‌, పిల్లల వెంకటేష్‌, ఆకుల మనోజ్‌, గుర్రం అజయ్‌గౌడ్‌, ఉస్తెం వినయ్‌కుమార్‌, కొరుకంటి హరికిషన్‌, మ్యాదగోని నవీన్‌, మోటం రాజశేఖర్‌, మెరుగు అరుణ్‌కృష్ణ, మహమ్మద్‌ కాశిఫ్‌, షరీఫ్‌, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular