Sunday, September 6, 2026

Buy now

విశేష సేవలందించిన పోలీస్ అధికారులకు సేవా పతకాలు

సిరిసిల్ల: పోలీస్ శాఖలో విధి నిర్వహణలో విశేష సేవలు అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పోలీస్ సేవా పతకాలకు ఎంపికైన జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పతకాలు అందజేశారు.

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పతకాలను అందజేసి ఎంపికైన అధికారులను అభినందించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అంకితభావంతో, కష్టపడి పనిచేసే పోలీస్ అధికారులు, సిబ్బందికి వారి సేవలకు తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. పోలీస్ శాఖలో విశేష సేవలు అందించి ప్రతిష్టాత్మక పోలీస్ సేవా పతకాలకు ఎంపికైన అధికారులను అభినందించారు.

* పోలీస్ సేవా పతకాలకు ఎంపికైన అధికారులు:

* రాజేందర్, హెడ్ కానిస్టేబుల్ – ముస్తాబాద్ పోలీస్ స్టేషన్:ఉత్తమ సేవా పతకం.
* నాగేశ్వరరావు, కమ్యూనికేషన్ ఎస్‌ఐ: సేవా పతకం.
* భూక్య లత, హెడ్ కానిస్టేబుల్ – ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్: సేవా పతకం.
* శ్రీనివాస్ – బోయినపల్లి పోలీస్ స్టేషన్:సేవా పతకం.
పోలీస్ శాఖలో అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ విశేష సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి సేవా పతకాలు ప్రోత్సాహాన్ని అందిస్తాయని అధికారులు తెలిపారు.

Related Articles

spot_img

Most Popular