హైదరాబాద్: శాసన మండలి ఎథిక్స్ కమిటీ (2026–27) ప్రాథమిక సమావేశం మంగళవారం కౌన్సిల్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రారంభమైంది. కమిటీ ఛైర్మన్, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్‌తో పాటు ఎథిక్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కమిటీ పరిధిలోని అంశాలు, సభ్యుల నైతిక ప్రమాణాలు, శాసన మండలి కార్యకలాపాలకు సంబంధించిన వివిధ అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

