పెద్దపల్లి : ప్రతి ఒక్కరికి భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని స్ఫూర్తి నిచ్చేలా ఓ కానిస్టేబుల్ 30 కి.మీ పరుగు నిర్వహించాడు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ అలీం కరీంనగర్ టవర్ సర్కిల్ నుండి పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయం వరకు 30 కి .మీ పరుగు చేసాడు. ఈ సందర్భంగా అలీం మాట్లాడుతూ స్వేచ్ఛ, ఈ ఎందరో మహనీయులు ప్రాణాలను త్యాగం చేయడం వల్ల లభించిన స్వాతంత్ర్యం, వారి త్యాగాల స్ఫూర్తి ఇప్పటికీ ప్రతి భారతీయుడి హృదయంలో సజీవంగానే ఉందని చూపించేందుకు పరుగు చేసానని అన్నారు. గతంలో భారత ఆర్మీలో దేశానికి సేవ చేసి ప్రస్తుతం తెలంగాణ పోలీస్ లో ప్రజలకు సేవ చేస్తున్నానని, సుమారు 150 కోట్ల మంది భారతీయుల హృదయాల్లో దేశభక్తి అనే స్ఫూర్తి ఇంకా సజీవంగానే ఉందని నా వంతుగా తెలియజేయాలనే ఒక చిన్న ప్రయత్నం అని అన్నారు. దేశం కోసం త్యాగం చేసిన మహనీయులను ఎప్పటికీ మరవవద్దని, వారిని ఆదర్శంగా తీసుకుని ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఆ మహనీయుల ఆశీస్సులతో జై హింద్! వందే మాతరం! నినాదాలతో తాను పరుగు ప్రారంభించినట్లు తెలిపారు.

