Sunday, September 6, 2026

Buy now

హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో పవర్ ఎక్స్‌పో–2026ను సందర్శించిన కల్వకుంట్ల కవిత

హైదరాబాద్: పీపుల్స్ ప్లాజాలో టీజీఎస్‌ఎస్‌డీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “పవర్ ఎక్స్‌పో–2026” ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సందర్శించి, విద్యుత్ రంగంలో వస్తున్న నూతన సాంకేతికతలు, ఆవిష్కరణల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, రాష్ట్రంలో గృహ విద్యుత్ కనెక్షన్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.“స్మార్ట్ మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. మన కరెంట్‌ను అదానీ చేతుల్లో పెట్టొద్దు.

సెల్‌ఫోన్‌కు రీచార్జ్ చేసుకున్నట్టుగా విద్యుత్ మీటర్లను కూడా రీచార్జ్ చేసుకుంటేనే కరెంట్ సరఫరా చేస్తామనడం అన్యాయమని ఆమె అన్నారు. ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసేందుకే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను తీసుకొస్తున్నారని ఆరోపించారు.“ప్రజల విద్యుత్ హక్కులను కాపాడాలి. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి”** అని కవిత డిమాండ్ చేశారు.

Related Articles

spot_img

Most Popular