మునుగోడు:80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మునుగోడు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో పాల్గొన్న పోలీసు సిబ్బంది ఎమ్మెల్యేకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు.స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

