సిరిసిల్ల: అర్హులైన పవర్లూమ్, అనుబంధ రంగాల కార్మికులకు చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా చేనేత జౌళి శాఖ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో పవర్లూమ్, అనుబంధ రంగాలకు చెందిన పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. అర్హత ఉన్నప్పటికీ పలువురు కార్మికులకు ఇప్పటివరకు చేనేత శాఖ గుర్తింపు కార్డులు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తింపు కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ ప్రయోజనాలకు దూరమవుతున్నామని తెలిపారు.
పవర్లూమ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి కార్మికుడికి చేనేత శాఖ గుర్తింపు కార్డు జారీ చేయాలని కోరారు. కార్మికుల ఆందోళనకు ఏఐఎస్టీయూ సంఘీభావం తెలిపింది.
ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని పవర్లూమ్, అనుబంధ రంగాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు.

