Sunday, September 6, 2026

Buy now

రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం

● ​దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

ప్రజానావ ఉమ్మడి మహబూబ్‌నగర్ బ్యూరో : రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద దేవరకద్ర మున్సిపాలిటీ, మండల రైతులకు వ్యవసాయం కోసం 40 ట్రాన్స్‌ఫార్మర్లతో పాటు AB స్విచ్‌లు, వైర్లు, పోళ్లను ఆయన పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గానికి ప్రభుత్వం 800 ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేసిందని, మొదటి విడతగా 40 అందించామని, మరో పది రోజుల్లో ఇంకో 60 ట్రాన్స్‌ఫార్మర్లు అందజేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో విద్యుత్ వ్యవస్థ బలోపేతానికి 13 సబ్‌స్టేషన్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయని, గత ఏడాదిలోనే 500 ట్రాన్స్‌ఫార్మర్లు పంపిణీ చేశామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular