* పెద్దవంగర మండలంలో ఆహార భద్రత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
పాలకుర్తి నియోజకవర్గం: అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు.
పెద్దవంగర మండలంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సోమవారం ఆహార భద్రత స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అర్హత కలిగిన కుటుంబాలకు పారదర్శకంగా స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.
స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందడంతో పాటు పారదర్శకత పెరుగుతుందని, ప్రభుత్వ పథకాల అమలు మరింత సులభతరం అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అర్హులైన వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యశస్విని రెడ్డి భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

