Sunday, September 6, 2026

Buy now

ప్రజల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే

* బాధితులకు భరోసా కల్పించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

రామగుండం: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్వయంగా హాజరై ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులు ఎదుర్కొంటున్న సమస్యల వివరాలను తెలుసుకున్నారు.

ఫిర్యాదుదారుల సమస్యలను వెంటనే పరిగణనలోకి తీసుకున్న సీపీ, సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం, భరోసా కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని ఎలాంటి ఆలస్యం లేకుండా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వానికి తావు ఉండకూడదని, బాధితులకు సత్వర న్యాయం అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీపీ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular