Sunday, September 6, 2026

Buy now

ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి

* అధికారులను ఆదేశించిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల: ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

ఈ సందర్భంగా మొత్తం 142 దరఖాస్తులు అందగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆర్డీఓ కార్యాలయాల్లోనూ ప్రజావాణి
సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 06 దరఖాస్తులు, వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో 05 దరఖాస్తులు అందాయి. సంబంధిత శాఖల అధికారులకు దరఖాస్తులను అందజేసి పరిష్కరించాలని ఆదేశించారు.

మండలాల్లో ప్రజావాణి
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎంపీడీఓల ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

మండలాల వారీగా దరఖాస్తులు
బోయినపల్లి – 09
చందుర్తి – 00
ఇల్లంతకుంట – 10
గంభీరావుపేట – 10
కోనరావుపేట – 02
ముస్తాబాద్ – 11
రుద్రంగి – 02
తంగళ్లపల్లి – 10
వీర్నపల్లి – 07
వేములవాడ అర్బన్ – 05
వేములవాడ రూరల్ – 12
ఎల్లారెడ్డిపేట – 03

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. స్థానిక ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను సమర్పించాలని సూచించారు. అందిన దరఖాస్తులన్నింటినీ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని పేర్కొన్నారు.

ఐడీఓసీ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, హౌసింగ్ పీడీ వెంకట మాధవ రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular