Sunday, September 6, 2026

Buy now

ఆగస్టు 27న అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించాలి

* SIR ప్రక్రియపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి
* మ్యాపింగ్ కాని, అనామలీస్ గుర్తించిన ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి

ములుగు:ఆగస్టు 27న అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. జిల్లాల ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పలు సూచనలు చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ములుగు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ “భోర్ఖడే హేమంత్ సహదేవరావు”, ఆర్డీఓ కృష్ణవేణి తో కలిసి హాజరయ్యారు.

* గ్రామ సభలు, వార్డు సభల నిర్వహణపై అవగాహన

ఆగస్టు 27న గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత గ్రామ పంచాయతీ భవనంలో, పట్టణ ప్రాంతాల్లో సంబంధిత పోలింగ్ కేంద్రంలో గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు. సంబంధిత బీఎల్‌ఓలు, చునావ్ పాఠశాల సభ్యులు సభల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గ్రామ సభలు, వార్డు సభల నిర్వహణపై బీఎల్‌ఓల ద్వారా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. సభల వద్ద **ఫారం-6, ఫారం-7, ఫారం-8** తదితర అవసరమైన ఫారాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు.

* డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై పరిశీలన

గ్రామ, వార్డు సభల్లో బీఎల్‌ఓలు డ్రాఫ్ట్ ఓటరు జాబితాలోని ఓటర్ల పేర్లను చదివి వినిపించాలని, జాబితాలో పేరు లేని అర్హత కలిగిన భారతీయ పౌరులను గుర్తించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు.

2026 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే వారు ఫారం-6తో పాటు డిక్లరేషన్ ఫారం, అవసరమైన ఆధారాలను సమర్పించి ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

* నోటీసుల జారీ ప్రక్రియ వేగవంతం

మ్యాపింగ్ కాని, అనామలీస్ గుర్తించిన ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

* అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: జిల్లా కలెక్టర్

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసుల జనరేషన్ ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేస్తున్నామని తెలిపారు.

ఆగస్టు 27న నిర్వహించనున్న గ్రామ సభలు, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.ములుగు నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి ఓటరు ఓటు హక్కును పరిరక్షించే విధంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సూపరింటెండెంట్, ఎలక్షన్ వింగ్ ఎం.డి. సలీం ఉద్దీన్, నాయబ్ తహసీల్దార్ (ఎలక్షన్) ఎం. నితీష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular