Sunday, September 6, 2026

Buy now

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

ప్రజానావ ​ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : అనారోగ్యంతో రేవల్లి మండలంలోని శనాయిపల్లి గ్రామానికి చెందిన సత్యం కుటుంబాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లిన నిరంజన్‌రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కష్టసమయంలో కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. అనంతరం కుటుంబ అవసరాల నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు శివరాంరెడ్డి, ఉపసర్పంచ్‌ సుధాకర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, ఖాజా, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular