* పచ్చదనం దిశగా.. రేవల్లిలో 100 మొక్కలు నాటిన అధికారులు, ప్రజాప్రతినిధులు
ప్రజానావ ఉమ్మడి మహాబూబ్ నగర్ బ్యూరో : రేవల్లి మండలంలో వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, మండల పరిషత్ కార్యాలయ ఆవరణల్లో విద్యార్థులు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా దాదాపు 100 మొక్కలు నాటారు.కార్యక్రమంలో ఎంపీడీవో కుమారి కీర్తన, సర్పంచ్ రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పర్వతాలు, ఎంఈఓ వరప్రసాద్ రావు, హెచ్‌ఎంలు ప్రసాద్, సరోజ, ఉపసర్పంచ్ సుధాకర్ రెడ్డి, స్థానిక నాయకులు, పోలీస్, పంచాయతీ శాఖల అధికారులు పాల్గొన్నారు.

