పెద్దపల్లి : జిల్లా ప్రధాన న్యాయస్థానంలో మదర్ థెరిసా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు కోర్టు ని సందర్శించారు. రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల విద్యార్థులకు ఉచిత న్యాయసేవల గురించి వివరించారు. పలు చట్టాల పైన అవగాహన కల్పించారు.
తదుపరి విద్యార్థులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా కుంచాల కి, పోక్సో న్యాయమూర్తి స్వప్నారాణి కి, సీనియర్ సివిల్ జడ్జి భవాని కి, న్యాయమూర్తి మట్ట సరిత కి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మదర్ థెరిస్సా కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

