ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : రేవల్లి – నాగర్కర్నూల్ ప్రధాన రహదారిపై పంట పొలాల వెళ్లే సాగునీరు కాలువపై ఇటీవల నిర్మించిన బ్రిడ్జి సీసీ రోడ్డు ప్రారంభానికి ముందే పెద్ద రంధ్రంతో కుంగిపోయింది. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మాజీ జడ్పీటీసీ భీమయ్య, మాజీ సర్పంచ్ శివరాం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మార్గం గుండా నిత్యం పొలం ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, నాగర్కర్నూల్ వెళ్లే వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, భారీ వాహనాలు ఏదైనా రంధ్రంలో చిక్కుకుంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని, రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

