Friday, September 4, 2026

Buy now

1000 రోజుల ప్రజా పాలన సంబరాలు

◆ రేవల్లి, ఏదులలో కాంగ్రెస్ భారీ బైక్ ర్యాలీ
◆ కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలి

ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో:ప్రతిపక్ష నేతగా ఉంటూ ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాకుండా ప్రజాధనాన్ని వాడుకుంటున్న కేసీఆర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఆదేశాల మేరకు రేవల్లి, ఏదుల మండలాల్లో కాంగ్రెస్ శ్రేణులు ప్రజా పాలన విజయవంతమైనందున సంబరాలు జరిపాయి.

మండల అధ్యక్షులు సుల్తాన్ ఆలీ, సుఖేందర్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో నాయకులు పాల్గొని మాట్లాడారు. ప్రజల కోసం పనిచేయకుండా జీతభత్యాలు పొందే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular