Friday, August 28, 2026

Buy now

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు:ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్

అంతర్గాం: అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. గురువారం అంతర్గాం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజల సమస్యలు, స్థానికంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై గ్రామ సభలో చర్చించారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పంపిణీ చేశారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

అదేవిధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా SIR ప్రక్రియపై అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, గ్రామస్థులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular