Thursday, August 27, 2026

Buy now

నిజామాబాద్‌ పాంచజన్య సభ పోస్టర్‌ ఆవిష్కరణ

— ఆర్మూర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం

ఆర్మూర్‌: ఆర్మూర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో ఈ నెల 31న నిర్వహించనున్న పాంచజన్య సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు సభను విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.

పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రామ్‌ కిషన్‌ రావు, రంగు నవీన్‌ ఆచారి, ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మంథని నవీన్‌ రెడ్డి, అవంతి రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ నెల 31న నిజామాబాద్‌లో జరగనున్న పాంచజన్య సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Related Articles

spot_img

Most Popular