Friday, August 28, 2026

Buy now

జిల్లా ఎస్పీకి రాఖీ కట్టి.. మిఠాయి తినిపించిన విద్యార్థినులు

* రక్షాబంధన్ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్‌కు శుభాకాంక్షలు
* మహిళలు, బాలికల భద్రతకు పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా

ఆదిలాబాద్: రక్షాబంధన్ సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థినులు, బ్రహ్మకుమారీస్ సభ్యులు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీకి మిఠాయి తినిపించి రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు.

ఇటీవల ఇచ్చోడ మండలం దాబా బి గ్రామంలో నిర్వహించిన ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో ఇచ్చోడ విద్యాలయ విద్యార్థులు డ్రగ్స్ నివారణ, రోడ్డు భద్రత అంశాలపై కళా ప్రదర్శన నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు ఎస్పీ అఖిల్ మహాజన్‌కు రాఖీ కట్టి తమకు రక్షగా నిలవాలని కోరారు.

మహిళలు, బాలికలకు పోలీసుల అండ

ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. మహిళలు, బాలికల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని, చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

రక్షాబంధన్ సందర్భంగా విద్యార్థినులు, బ్రహ్మకుమారీస్ సభ్యులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపినందుకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

spot_img

Most Popular